అంబర్‌పేట: నల్లకుంట ఫీవర్ దవాఖాన, తిలక్‌నగర్ రోడ్డులోని బెత్లామ్ కళాశాలలో రెండు నెలల నర్సింగ్ అసిస్టెంట్ కోర్సుల్లో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తు న్నట్లు ప్రిన్సిపాల్ మ్యాన్సీ ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్/ఫెయిల్ అయిన వారు దీనికి అర్హులన్నారు. వయస్సు 18 సంవత్సరాల నుంచి 29 ఏళ్ల లోపు ఉండాలన్నారు. శిక్షణ ముగిసిన తర్వాత ప్లేస్‌మెంట్ కూడా ఇప్పిస్తామ న్నారు. నెలకు రూ.9వేల నుంచి రూ.12వేల వరకు జీతం ఉంటుందన్నారు. ఈ కోర్సుతో పాటు కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిషులో కూడా ఉచితంగా శిక్షణ ఉంటుందన్నారు. వివరాలకు 9908098 903, 9515485280 సంప్రదించాలన్నారు.