మేడ్చల్ : జిల్లాలో వచ్చే నవంబర్ 4వ తేదీన జరుగనున్న నేషనల్ టాలెంట్ సెర్చ్ (ఎన్‌టీఎస్‌ఈ) ప్రాథమిక పరీక్ష రాసేందుకు గాను 10వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన విద్యా సంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్సీ, ఐసీఎస్సీ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరు ఈ పరీక్షకు అర్హులని తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 28 లోపు ఏదైన ట్రెజరరీ బ్రాంచ్ ద్వారా రూ.100 చలాన్ చెల్లించాలన్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగ విద్యార్థులు తమ తమ కుల, ఆదాయ, విద్యార్హత, ఆరోగ్య ధ్రువ పత్రాలు, ఓబీసీ విద్యార్థులు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు, నాన్ క్రిమిలేయర్ ప్రతాలతో ఈ నెల 29 వ తేదీ లోపు httpb//bse.telangana.gov.in అనే వెబ్‌సైట్ నందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదే విధంగా 30వ తేదీన ప్రధానోపాధ్యాయులు ముద్రిత దరఖాస్తులు, నామినల్ రోల్స్, కుల, ఆదాయ పత్రాలను నకళ్ళను ధ్రువీకరించాలని ప్రకటనలో సూచించారు. మరిన్ని వివరాల కోసం 9701678786, 9052003330, 9247834799 ను సంప్రదించాలన్నారు.