సనత్‌నగర్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పరిధిలో పనిచేస్తున్న ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్‌లో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఇంటర్న్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-ఈఎస్‌ఐసీని మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1952 ఫిబ్రవరి 24న స్థాపించారు.
-మొత్తం ఖాళీల సంఖ్య: 44 (జనరల్-23, ఓబీసీ-11, ఎస్సీ-7, ఎస్టీ-3)
-అర్హతలు: గుర్తింపు పొందిన యునివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజస్టర్ చేసుకొని ఉండాలి.
-పే స్కేల్ : 22,000/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 27 (సాయంత్రం 4 గంటల వరకు)
-వెబ్‌సైట్: www.esicmchyd.ac.in