కాచిగూడ : బర్కత్‌పుర నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్‌డిజైనింగ్(నిఫ్ట్)ఆధ్వర్యంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో చేరడానికి ఉచిత స్కాలర్‌షిప్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ యు.గీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో చేరడానికి ఈ ఉచిత స్కాలర్‌షిప్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్కాలర్‌షిప్ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చి ఎంపికైన విద్యార్థులకు ఫీజులో 20శాతం నుంచి 40శాతం వరకు రాయితీని కల్పించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థినులు, మహిళలు జూన్ 5వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. వివరాలకు 9030610033/55 లో సంప్రదించవచ్చన్నారు.