బేగంబజార్ : నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణతోపాటు ఉపాధిని కల్పించే లక్ష్యంగా ఉపాధి శిక్షణ శాఖ నిరంతరం కృషి చేస్తుందని శాంతినగర్ ఐటీఐ ప్రిన్సిపల్ పసుపులేటి శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద నిరుద్యోగ యువతీయువకులకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ కోర్సులో ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కోర్సులో శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులన్నారు. ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు వయసు పరిమితి లేదన్నారు. జూన్ 1వ తేదీ నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి అర్హతగల వారు ఈ నెలాఖరులోపు మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లోని శాంతినగర్ ప్రభుత్వ ఐటీఐలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మరింత సమాచారం కోసం 9440068152 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.