notifications

వారసత్వ కొలువుల జోష్

webdesk | Monday, February 6, 2017 8:35 AM IST

హైదరాబాద్  :సింగరేణిలో ఎన్నో ఏండ్ల్లుగా పెండింగ్‌లో ఉన్న వారసత్వ ఉద్యోగాల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో, అర్హులైన అభ్యర్థులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. సంస్థలో 58వేల మంది కార్మికులు సహా సుమారు 80 వేల మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. రిటైర్మెంట్‌కు రెండు సంవత్సరాలు సమయం ఉన్నవారి వారసులు మాత్రమే వారసత్వ ఉద్యోగాలు పొందడానికి అర్హులు. తమ్ముడు/కొడుకు/అల్లుడు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే రిటైర్మెంట్‌కు రెండు సంవత్సరాల పైబడి సమయం ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోవడానికి అధికారులు అవకాశం ఇచ్చారు. ఉద్యోగి సర్వీసు రెండు సంవత్సరాల్లో ముగుస్తుంద నగా వారి వారసుల దరఖాస్తును వారసత్వ ఉద్యోగానికి అర్హతగా భావిస్తారు. శ్రీరాంపురం నుంచి ఎక్కు వ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల కోసం ఇప్పటివరకు 3,739 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో రిటైర్మెంట్‌కు రెండేండ్ల కంటే తక్కువ సమయం ఉన్నవారి వారసుల నుంచి వచ్చిన దరఖాస్తులు 1685 ఉన్నాయి. రిటైర్మెంట్‌కు రెండేండ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నవారి వారసుల నుంచి 2054 దరఖాస్తులు వచ్చాయి.