notifications

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో స్టాఫ్‌నర్స్ ఖాళీల వివరాలు

Webdesk | Sunday, January 7, 2018 10:54 AM IST

  హైదరాబాద్ : స్టాఫ్‌నర్స్ కొలువుల భర్తీలో భాగంగా సవరించిన ఖాళీల వివరాలను తమ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌లోని 835 ఖాళీలు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్‌లో 2476 ఖాళీల తుది వివరాలు బ్రేకప్‌ల వారీగా ఉంచినట్టు వివరించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8వరకు గడువు ఉన్నట్టు పేర్కొన్నది. 


వెబ్‌సైట్లో పీసీబీ కొలువుల ఎంపిక జాబితా 
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, అనలిస్ట్ గ్రేడ్-2, స్టెనో కం టైపిస్ట్ కొలువులకు ఎంపిక ప్రక్రియ పూర్తయినట్టు టీఎస్‌పీఎస్సీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితా ఈ నెల 8 నుంచి టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.