notifications

టెట్ నోటిఫికేషన్ విడుదల

Webdesk | Monday, June 12, 2017 12:29 AM IST

హైదరాబాద్: టీఎస్ టెట్-2017 నోటిఫికేషన్ శనివారం విడుదలయింది. సోమవారం (12వ తేదీ) నుంచి ఈ నెల 23 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల దాఖలు కోసం ఫీజులు చెల్లించవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జీ కిషన్ తెలిపారు. రాష్ట్రంలో బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన 26,100 మంది టెట్ కోసం ఎదురుచూస్తున్నారని, ఈ నోటిఫికేషన్‌తో వీరందరికీ ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. జూలై 23న టెట్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.