notifications

స్వామి రామానందలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Webdesk | Saturday, July 14, 2018 2:09 PM IST

  భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, వసతి కోసం ప్రకటన విడుదలైంది.


దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద నిర్వహిస్తున్న ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణా కార్యక్రమం. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది.
కోర్సులు- కాలపరిమితి- అర్హత:
-ఆటోమొబైల్ (2,3 వీలర్ సర్వీసింగ్)- 3 నెలలు - పదోతరగతి పాస్
-ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, మెయింటెనెన్స్ (సెల్‌ఫోన్‌తోపాటు) - 3 నెలలు - పదోతరగతి ఉత్తీర్ణత
-ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్)- 4 నెలలు- పదోతరగతి పాస్
-డీటీపీ, ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్-3 నెలలు - ఇంటర్ పాస్
-అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ)- 3 నెలలు - బీకాం పాస్
-కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్ - 3 నెలలు - ఇంటర్ పాస్
-సోలార్ సిస్టమ్ ఇన్‌స్టలేషన్, సర్వీస్ - 3 నెలలు - ఇంటర్ పాస్/ఐటీఐ
-సూయింగ్ మెషిన్ ఆపరేటర్ (టైలరింగ్ మెషిన్)- 3 నెలలు - 7వ తరగతి పాస్/ఫెయిల్
-అర్హతలు: 18 -35 ఏండ్ల మధ్య ఉండాలి. గ్రామీణ అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు. 
-శిక్షణ, వసతి, భోజన సౌకర్యం పూర్తిగా ఉచితం.
-శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
-ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్హత సర్టిఫికెట్స్, పాస్‌పోర్ట్ ఫొటో, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డుతో జూలై 16న ఉదయం 10 గంటలకు సంస్థ కార్యాలయంలో హాజరుకావాలి.
-పూర్తి వివరాల కోసం: 9133908000, 9133908111, 9948466111