-పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్
-పేస్కేల్: రూ.23,700-42020+ డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్స్‌లు ఇస్తారు.
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా పీజీడీబీఎఫ్ కోర్సుకు ఎంపిక చేస్తారు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేసినవారికి పీవోగా ఉద్యోగం ఇస్తారు.
-పీజీడీబీఎఫ్: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఈ కోర్సును మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది.
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ కోర్సులు కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. దూరవిద్యా విధానంలో చదివిన వారు అనర్హులు.
-వయస్సు: 2018, నవంబర్ 30 నాటికి 25 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు సడలింపు ఉంటుంది.
-పీజీడీబీఎఫ్ కోర్సు: ఇది 8 నెలల రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రోగ్రామ్. తర్వాత బ్యాంక్ బ్రాంచీల్లో నాలుగు నెలల ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇది పూర్తయిన తర్వాత సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ స్కేల్-1 క్యాడర్‌లో ఉద్యోగావకాశం కల్పిస్తారు. ప్రోగ్రామ్ ఫీజు రూ.3.50 లక్షలు (వసతి, లాడ్జింగ్, ఇతర అన్ని ఫీజులు కలిపి)
-రుణసౌకర్యం: ఫీజు మొత్తాన్ని బ్యాంక్ రుణంగా అందిస్తుంది. బ్యాంక్‌లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఏడేండ్లలో ఈ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాలి.
-ఇన్సెంటివ్స్: శిక్షణ సమయంలో నెలకు రూ.3,000/ ఇస్తారు. ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు రూ.15వేలు ఇస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు (ఏడాది కోర్సు, ఏడాది బ్యాంక్‌లో)
-ఆన్‌లైన్ టెస్ట్: 200 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో రీజనింగ్&కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, డాటా అనాలసిస్&ఇంటర్‌ప్రిటేషన్. పరీక్ష కాలవ్యవధి 140 నిమిషాలు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్ 10 నుంచి ప్రారంభం
-ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.800/-, ఎస్సీ/ఎస్టీలకు రూ.200/-
-చివరితేదీ: డిసెంబర్ 16
-వెబ్‌సైట్: www.southindianbank.com