notifications

నర్సింగ్ అసిస్టెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

webdesk | Monday, February 6, 2017 8:30 AM IST

హైదరాబాద్ : నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి చౌరస్తాలో గల బెత్లామ్ కళాశాలలో నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో రెండు నెలల ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మ్యాన్సీ తెలిపారు. రెండు నెలల ఉచిత శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్‌తో పాటు కార్పొరేట్ దవాఖానల్లో ఉద్యోగం కూడా ఇప్పించడం జరుగుతుందన్నారు. నెలకు రూ.7వేల నుంచి రూ.12వేల వరకు జీతం ఉంటుందని వెల్లడించారు. పదోతరగతి పాస్/ఫెయిల్ అయిన వారు, 18 నుంచి 29 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. ఈ శిక్షణతో పాటు యూనిఫాం, బుక్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కంప్యూటర్‌తో పాటు స్పోకెన్ ఇంగ్లిష్‌లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా రూ.825లు బస్‌పాస్‌కు ఇవ్వడం జరుగుతుందని, తప్పనిసరిగా ఉద్యోగం చేస్తామనే వారు మాత్రమే ఈ శిక్షణకు రావాలని కోరారు. వివరాలకు సెల్ 9908098903, 9515485280లలో సంప్రదించాలని కోరారు.