notifications

మేనేజ్‌మెంట్ ట్రెయినీల పోస్టుల భర్తీ

Webdesk | Sunday, December 24, 2017 11:31 AM IST

 నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 


వివరాలు: 
-పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-మొత్తం పోస్టుల సంఖ్య: 41
-విభాగాలవారీగా ఖాళీలు: కెమికల్-25, మెకానికల్ -10, ఎలక్ట్రికల్-6
-అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. గేట్ స్కోర్ -2016లో అర్హత సాధించాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. 
-వయస్సు: 2017, డిసెంబర్ 31 నాటికి 27 ఏండ్లకు మించరాదు. 
-పే స్కేల్: రూ. 16,400-40,500/- వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
-దరఖాస్తు ఫీజు: రూ. 735/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: గేట్ స్కోర్-2016 +ఇంటర్వ్యూ ద్వారా
-గేట్ -2016 స్కోర్‌కు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
-చివరితేదీ: 2018, జనవరి 18
-వెబ్‌సైట్: www.nationalfertilizers.com