notifications

జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్లు

Webdesk | Thursday, January 25, 2018 8:43 PM IST

 జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

 
-మొత్తం ఖాళీల సంఖ్య -121
-విభాగాలవారీగా ఖాళీలు: ప్రొఫెసర్స్-28, అడిషనల్ ప్రొఫెసర్స్-24, అసోసియేట్ ప్రొఫెసర్స్-45, అసిస్టెంట్ ప్రొఫెసర్స్-24.
-విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజమ్, ఫోరెన్సిక్ మెడిసిన్/టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఒబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పిడియాట్రిక్ సర్జరీ, పాథాలజీ, పిడియాట్రిక్, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, సైకియాట్రీ, రేడియోగ్నసిస్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రామా అండ్ ఎమర్జెన్సీ, యూరాలజీ 
-అర్హతలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత లేదా సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీ పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వంను కలిగి ఉండాలి. సంబంధిత టీచింగ్/ రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు 
-ప్రొఫెసర్ (పే బ్యాండ్ 4) : రూ.37,400-67,000+గ్రేడ్ పే రూ. 10,500/-
-అడిషనల్ ప్రొఫెసర్ (పే బ్యాండ్ 4) : రూ.37,400-67,000+ గ్రేడ్ పే రూ. 9,500/-
-అసోసియేట్ ప్రొఫెసర్ (పే బ్యాండ్ 4) : రూ.37,400-67,000+ గ్రేడ్ పే రూ. 9,000/-
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (పే బ్యాండ్ 3) : రూ.15,600-39,100+ గ్రేడ్ పే రూ. 8,000/-
-అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.3000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.1000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 12
-వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in