భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) టెలికామ్ విభాగంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం పోస్టులు: 218
-పురుషులు-185 ఖాళీలు (జనరల్-93, ఓబీసీ-50, ఎస్సీ-28, ఎస్టీ-14)
-మహిళలు-33 ఖాళీలు (జనరల్-17, ఓబీసీ-9, ఎస్సీ-5, ఎస్టీ-2)
-పోస్టుపేరు: కానిస్టేబుల్ (టెలికామ్)
-అర్హతలు: పదోతరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత. ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-వయస్సు: 2018 నవంబర్ 27 నాటికి 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్/ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 21,700-69,100 (7వ వేతన పే స్కేల్ ప్రకారం)
-శారీరక ప్రమాణాలు: పురుషులు-170 సెం.మీ. ఎత్తు, ఛాతీ 80 సెం.మీ.- 85 సెం.మీ.వరకు వ్యాకోచించాలి.
-మహిళా అభ్యర్థులు- 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
-పీఈటీ టెస్ట్: పురుషులు 7.30 నిమిషాల్లో 1.6 కి.మీ, మహిళలు 4.45 నిమిషాల్లో 800 మీటర్ల పరుగుపందెం పూర్తిచేయాలి.
-బరువు: వైద్య ప్రమాణాల ప్రకారం ఎత్తు, వయస్సుకు దామాషాగా ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-, ఎస్సీ/ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
-ఎంపిక: ఆబ్జెక్టివ్ రాతపరీక్ష, పీఎస్‌టీ, పీఈటీ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 27
-వెబ్‌సైట్: www.recruitment.itbpolice.nic.in