notifications

ఇస్రోలో సైంటిస్ట్/ఇంజినీర్స్ పోస్టులు

webdesk | Tuesday, February 28, 2017 10:23 PM IST

డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్/ఇంజినీర్స్ (ఎస్‌సీ) పోస్టుల (తాత్కాలికంగా) భర్తీకి ఇస్రో సెంట్రలైజ్‌డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఐసీఆర్‌బీ) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

వివరాలు: బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఏర్పాటుచేసిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను విక్రమ్ సారాభాయ్ 1969 ఆగస్టు 15న స్థాపించారు. ఇది అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. 
పోస్టు పేరు: సైంటిస్ట్/ఇంజినీర్స్(ఎస్‌సీ)
-మొత్తం పోస్టుల సంఖ్య: 27
-సైంటిస్ట్/ఇంజినీర్స్(ఎస్‌సీ) - 9 పోస్టులు (సివిల్)
-సైంటిస్ట్/ఇంజినీర్స్(ఎస్‌సీ) - 9 పోస్టులు (ఎలక్ట్రికల్)
-సైంటిస్ట్/ఇంజినీర్స్(ఎస్‌సీ) - 7 పోస్టులు (రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్)
-సైంటిస్ట్/ఇంజినీర్స్(ఎస్‌సీ) - 2 పోస్టులు (ఆర్కిటెక్చర్)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (ఇంజినీరింగ్), బీఈ/బీటెక్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆర్కిటెక్చర్)లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సీజీపీఏ 6.84 టెన్ స్కేల్ క్వాలిఫయింగ్ డిగ్రీ/ఏఎమ్‌ఐఈ/గ్రేడ్ ఐఈటీఈలో సీజీపీఏ 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 2017 ఆగస్ట్ 31 నాటికి డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేయనున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2017 మార్చి 14 నాటికి 35 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, ఎక్‌సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ అభ్యర్థులకు సంస్థ నిర్ణయించిన ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పేస్కేల్: రూ. 56,100/- అదనంగా ఇంటిఅద్దె, రవాణా అలవెన్స్, ఉద్యోగుల కొత్త పెన్షన్ పథకం, గ్రూప్ ఇన్సూరెన్స్, వైద్యం తదితర ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.
పని చేసే ప్రదేశం: దేశవ్యాప్తంగానున్న ఇస్రో సెంటర్లు /యూనిట్లలో
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలానా ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: అకడమిక్ ప్రతిభ, బయోడేటా ఆధారంగా మొదట స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత అర్హత గల అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. 

-రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్ పొందిన అభ్యర్థులకు ఈ- మెయిల్ ద్వారా ఏప్రిల్ 2017లో తెలియజేస్తారు. 
-ఈ పోస్టులు ప్రస్తుతం తాత్కాలికమైనవి, తర్వాత పర్మినెంట్ చేసే అవకాశం ఉంది 
-రాతపరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో సంబంధిత సబెక్ట్ నుంచి 90 ప్రశ్నలు ఇస్తారు. 90 మార్కులకు పరీక్ష ఉంటుంది.
-రాతపరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

రాతపరీక్ష తేదీ: 2017 మే 7
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, చెన్నై, గువాహటి, లక్నో, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, తిరువనంతపురం.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఇస్రో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వినియోగంలో ఉన్న ఈ- మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్‌చేయాలి. ఫీజు బ్యాంక్ చలానాను సంబంధిత పర్సనల్ అధికారికి ఆర్డినరీ పోస్ట్‌లో పంపాలి.

చిరునామా: ANTARIKSH BHAVAN,ISRO HEADQUARTERS, NEW BEL ROAD, BENGALURU-5600231
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 14
ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: మార్చి 21
వెబ్‌సైట్:HTTP://WWW.ISRO.GOV.IN