notifications

ఐవోసీఎల్‌లో జూనియర్ ఆపరేటర్లు

Webdesk | Wednesday, January 31, 2018 8:07 PM IST

 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) సదరన్ రీజియన్ పరిధిలోని మార్కెటింగ్ డివిజన్ (నాన్ ఎగ్జిక్యూటివ్ )లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆపరేటర్ (గ్రేడ్ 1, ఏవియేషన్) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

 
వివరాలు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇండియాలోని ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య: 98 (జూనియర్ ఆపరేటర్ (గ్రేడ్ 1)-51, జూనియర్ ఆపరేటర్ ఏవియేషన్-46, జూనియర్ చార్జ్‌మ్యాన్-1)
-ప్రాంతాలవారీగా ఖాళీలు: తెలంగాణ-11, ఏపీ-12, కర్ణాటక-28, కేరళ-3, తమిళనాడు/పుదుచ్చేరి-44 
-పోస్టు పేరు: జూనియర్ ఆపరేటర్ (ఏవియేషన్)
-అర్హత: హయ్యర్ సెకండరీ లేదా ఇంటర్‌లో 45 శాతం (ఎస్సీ, ఎస్టీ 40 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-పోస్టు పేరు: జూనియర్ ఆపరేటర్ (గ్రేడ్ 1)
-అర్హత: పదోతరగతితోపాటు రెండేండ్ల వ్యవధిగల ఐటీఐ ట్రేడ్ (ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్)లో ఉత్తీర్ణత . సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-పోస్టు పేరు: జూనియర్ చార్జ్‌మ్యాన్
-అర్హత: పదోతరగతితోపాటు మూడేండ్ల వ్యవధిగల డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్)లో ఉత్తీర్ణత . సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018 జనవరి 31 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌లకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్ : రూ. 10,500-24,500/-
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ రూ. 150/-
-ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, స్కిల్ ప్రొఫిషియెన్సీ ఫిజికల్ టెస్ట్(ఎస్‌పీపీటీ) ద్వారా. అభ్యర్థులు రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్-40, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-20, రీజనింగ్ ఎబిలిటీస్-20, బేసిక్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్-20 అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 
-ఈ ఆబ్జెక్టివ్ పరీక్షను 90 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు
-ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఇస్తారు.
-రాతపరీక్షలో నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణలై వారి మెరిట్ జాబితా నుంచి 1:2 నిష్పత్తిలో ఎస్‌పీపీటీకి ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను ప్రింట్ తీసి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: 
Post Box No-3321, 
Nungambakkam MDO, 
Chennai-600034
-చివరితేదీ: ఫిబ్రవరి 10
-హార్డ్ కాపీలకు చివరితేదీ: ఫిబ్రవరి 16
-రాతపరీక్ష తేదీ: ఫిబ్రవరి 25
-ఫలితాలు విడుదల: మార్చి 10
-వెబ్‌సైట్: https://www.iocl.com