ఇండియన్ నేవీ జనరల్ సర్వీస్/ హైడ్రోక్యాడర్‌లో ఖాళీగా ఉన్న ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్, ఎన్‌ఏఐసీలో పీసీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుషుల నుంచి ఇండియన్ నేవల్ అకాడమీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
- మొత్తం ఖాళీలు: 102
- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ లేదాహైడ్రోగ్రఫీ క్యాడర్)-30 ఖాళీలు
- అర్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఎన్‌ఏఐసీ)-12 ఖాళీలు
- అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/టెలి కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, మైక్రో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంట్రోల్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్, ఏరోస్పేస్, మెటలర్జికల్, కెమికల్, మెటీరియల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్/ఐటీలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- టెక్నికల్ బ్రాంచ్ (ఇంజినీరింగ్ జనరల్ సర్వీస్)-28 ఖాళీలు
- అర్హత: మెకానికల్, మెరైన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ప్రొడక్షన్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ & మేనేజ్‌మెంట్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, మెటలర్జీ, మెకట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- టెక్నికల్ బ్రాంచ్ (ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్)-32 ఖాళీలు
- అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్, పవర్/ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- వయస్సు: 1995 జనవరి 2 నుంచి 2000 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
- గమనిక: ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్షన్ క్యాడర్ (ఎన్‌ఏఐసీ) పోస్టులను మాత్రమే పర్మినెంట్ కమిషన్ కింద, మిగతావి షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు.
- శారీరక ప్రమాణాలు: 157 సెం.మీ.ఎతు ్త ఉండాలి. సంస్థ నిబంధనల ప్రకారం నిర్దిష్ట శారీరక/వైద్య ప్రమాణాలతోపాటు మంచి కంటిచూపు, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
- ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలను రెండు దశల్లో చేపడుతుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం,కోయంబత్తూరులలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూల్లో మొదటి స్టేజీలో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్, డిస్కషన్ టెస్ట్ ఇంటర్వ్యూలను మొదటిరోజు నిర్వహిస్తారు. తర్వాత రెండోదశలో వీరికి సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూలను మొత్తం మూడు నుంచి ఐదు రోజులపాటు నిర్వహిస్తారు.
- శిక్షణ: నేవల్ ఓరియెంటేషన్ కోర్సును కేరళ-ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణను ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులు ప్రారంభం: జనవరి 12
- దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 19
- వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in