notifications

హైదరాబాద్ లో 25న ఉద్యోగ మేళా

Webdesk | Wednesday, November 22, 2017 9:50 AM IST

 హైదరాబాద్: ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ ఈ నెల 25వ తేదీన ఈ కామర్స్ మార్కెటింగ్ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ శ్రీలత తెలిపారు. కొత్తపేటలోని ట్రేడ్ హైదరాబాద్ కార్యాలయంలో ఈ ఉద్యోగ మేళా జరుగుతుందని వెల్లడించారు. ఈ కామర్స్ మార్కెటింగ్, నెట్ వర్కింగ్ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, టెలీ మార్కెటింగ్, బిజినెస్ డెవలప్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్ తదితర రంగాలలో ఉద్యోగాల కోసం ఏదేని డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు, ఫ్రెషర్స్ అర్హులని పేర్కొన్నారు. ఈ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24వేల నుంచి 32వేల వరకు వేతనం, టీఎ, డీఎ, ఇతర అలవెన్సులు ఉంటాయన్నారు. ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదని, వివరాలకు 73375 56150 నెంబర్‌లో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు.