notifications

హెచ్‌పీసీఎల్‌లో టెక్నీషియన్లు

webdesk | Wednesday, May 24, 2017 11:17 PM IST

వైజాగ్‌లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) బాయిలర్, ఆపరేషన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైనఅభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


వివరాలు: హెచ్‌పీసీఎల్ నవరత్న కంపెనీ. దీనిని 1974లో ఏర్పాటు చేశారు. ఫార్చ్యూన్ 500 గ్లోబల్ కంపెనీల్లో హెచ్‌పీసీఎల్ ఒకటి.
పోస్టు పేరు: టెక్నీషియన్ (బాయిలర్/ఆపరేషన్స్)
మొత్తం పోస్టుల సంఖ్య: 60 (జనరల్-23, ఓబీసీ-18, ఎస్సీ-7, ఎస్టీ-12)
అర్హత: ఆపరేషన్ విభాగంలోని పోస్టులకు డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్, బాయిలర్ విభాగంలోని పోస్టులకు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. దీంతోపాటు ఫస్ట్‌క్లాస్ బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత కోర్సుల్లో జనరల్/ఓబీసీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, మిగతా అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2017 మే 1 నాటికి 25 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
పే స్కేల్ : రూ. 40,000/- ఎంపికైన అభ్యర్థులు 9 నెలలు ప్రొబేషనరీ పీరియడ్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత రెగ్యులర్ ఉద్యోగిగా పరిగణిస్తారు. ఏడాదికి రూ. 5-6 లక్షల వేతనం ఉంటుంది. అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా హెచ్‌పీసీఎల్ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ.600/- (జనరల్/ఓబీసీ అభ్యర్థులు), ఎస్సీ, ఎస్టీ , పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
దరఖాస్తులుచివరి తేదీ: జూన్ 8
వెబ్‌సైట్: www.hindustanpetroleum.com