notifications

గిరిజన మహిళలకు న్యాక్‌లో శిక్షణ..

Webdesk | Thursday, March 22, 2018 10:30 PM IST

 హైదరాబాద్ : జిల్లాలో గల గిరిజన నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌లో పలు కోర్సుల్లో శిక్షణనివ్వనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి గిరిజన అభివృద్ధి అధికారి హన్మంత్‌నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కస్టమర్ రిలేషన్స్, సేల్స్ విత్ రిటైల్ స్టోర్స్ కోర్సుల్లో శిక్షణనివ్వనున్నామన్నారు. ఆసక్తి గల వారు మార్చి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 2వ తేదీ నుంచి 45 రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణనివ్వనున్నామన్నారు. శిక్షణ ముగిసిన తర్వాత షాపర్స్‌స్టాప్, ప్యాంటలూన్స్, మ్యాక్స్, రిలయన్స్‌ట్రెండ్, ఫ్యూచర్‌గ్రూపు, స్టార్‌బక్స్ మొదలగు మాల్స్‌లలో ప్లేస్‌మెంట్ సౌకర్యాన్ని కల్పించనున్నామన్నారు. ఆయా ఉద్యోగాల్లో చేరిన వారికి రూ. 10 వేల వేతనం పొందేందుకు వీలుగా మార్గదర్శకాలను నిర్ణయించామన్నారు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు ఫొటో ఐడీ, అడ్రస్ ఫ్రూఫ్, (ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్, ఓటర్‌కార్డు), విద్యార్హత దృవపత్రము, పాన్‌కార్డ్ ఉన్న వారు దాని ప్రతులను జతపరచాలన్నారు. ఆసక్తి గలవారు గృహకల్ప బిల్డింగ్ గ్రౌండ్‌ఫ్లోర్, గాంధీభవన్ ఎదురుగా గల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించి ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.