notifications

ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదల

webdesk | Thursday, June 8, 2017 7:01 PM IST

హైదరాబాద్: ఎడ్‌సెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ నెల 11న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూన్ 12 నుంచి జులై 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుంతో జులై 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జులై 16న ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. జులై 28న ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల చేస్తారు.