హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) ఖాళీగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం ఖాళీల సంఖ్య: 14 (టెక్నికల్ ఆఫీసర్-8, సైంటిఫిక్ అసిస్టెంట్-6)
-అర్హతలు: టెక్నికల్ ఆఫీసర్-గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 21,000/- (కన్సాలిడేటెడ్ పే)
-సైంటిఫిక్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 25 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 16,978/-(కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, దానికి సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
-రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీ: మార్చి 3
-వెబ్‌సైట్: www.ecil.co.in