notifications

ఢిల్లీ పోలీస్‌శాఖలో సివిలియన్ జాబ్స్

Webdesk | Sunday, December 10, 2017 11:01 AM IST

 ఢిల్లీ పోలీస్ శాఖలో మల్టీటాస్కింగ్ స్టాఫ్ (సివిలియన్) పోస్టుల భర్తీకి నిర్వహించే ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ - 2017 నోటిఫికేషన్ విడుదలైంది.

 
-పోస్టులు: మల్టీటాస్కింగ్ స్టాఫ్ (సివిలియన్)
-ఈ పోస్టులు గ్రూప్ - సీ, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులు. పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాల వారీగా పోస్టులు..
-కుక్ - 253. వీటిలో జనరల్ - 127, ఎస్సీ - 7, ఎస్టీ - 17, ఓబీసీ - 102 ఖాళీలు ఉన్నాయి.
-వాటర్ క్యారియర్ - 54. వీటిలో జనరల్ - 27, ఎస్సీ - 5, ఎస్టీ - 2, ఓబీసీ - 20 ఖాళీలు ఉన్నాయి.
-సఫాయి కర్మచారి - 237. వీటిలో జనరల్ - 119, ఎస్సీ - 5, ఎస్టీ - 51, ఓబీసీ - 62 ఖాళీలు ఉన్నాయి.
-మోచి (కాబ్లర్) - 14. వీటిలో జనరల్ - 7, ఎస్టీ - 3, ఓబీసీ - 4 ఖాళీలు ఉన్నాయి.
-దోబి (వాషర్‌మ్యాన్) - 68. వీటిలో జనరల్ - 34, ఎస్సీ - 2, ఎస్టీ - 9, ఓబీసీ - 23 ఖాళీలు ఉన్నాయి.
-టైలర్ - 16. వీటిలో జనరల్ - 9, ఎస్సీ - 1, ఎస్టీ - 2, ఓబీసీ - 4 ఖాళీలు ఉన్నాయి.
-డాఫ్ట్రి - 3. వీటిలో జనరల్ - 1, ఎస్టీ - 1, ఎస్సీ - 1 ఖాళీ ఉన్నాయి.
-మాలి (గార్డెనర్) - 16. వీటిలో జనరల్ - 8, ఎస్టీ -2, ఎస్సీ - 6 ఖాళీలు ఉన్నాయి.
-బార్బర్ - 39. వీటిలో జనరల్ - 22, ఎస్సీ - 7, ఎస్టీ - 6, ఓబీసీ - 4 ఖాళీలు ఉన్నాయి.
-కార్పెంటర్ - 7. వీటిలో జనరల్ - 5, ఓబీసీ - 2 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: కుక్, వాటర్ క్యారియర్, సఫాయి కర్మచారి, మోచి (కాబ్లర్), టైలర్, డాఫ్ట్రి, మాలి, కార్పెంటర్ పోస్టులకు రూ. 18,000 - 56,900/-
-దోబి, బార్బర్ పోస్టులకు రూ. 19,900 - 63,200/-
-వయస్సు: 2018, జనవరి 16 నాటికి 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 30 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 32, పీహెచ్‌సీలకు 35 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-దరఖాస్తు:ఆన్‌లైన్‌లో డిసెంబర్ 17 నుంచి ప్రారంభం
-చివరితేదీ: 2018, జనవరి 16
-వెబ్‌సైట్: www.delhipolicerecruitment.nic.in