notifications

కెనరా బ్యాంక్‌లో 450 పీవోలు

Webdesk | Tuesday, January 16, 2018 7:30 PM IST

 జాతీయ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్‌లోని ఆఫీసు/బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, ఎన్‌ఐటీటీఈ యూనివర్సిటీతో సంయుక్తంగా ఏడాదిపాటు పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తున్నది. ఈ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులు మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ (బెంగళూరు), ఎన్‌ఐటీటీఈ యూనివర్సిటీ గ్రేటర్ మంగళూరులో ఏదో ఒకచోట ఏడాదిపాటు పీజీడీబీఎఫ్ కోర్సును చదవాల్సి ఉంటుంది. విజయవంతంగా కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) లేదా అసిస్టెంట్ మేనేజర్ స్థాయిలో కెనరాబ్యాంక్‌లో ఉద్యోగావకాశం కల్పిస్తారు.
-పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్
-కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్)
-కాల వ్యవధి: ఏడాది
-మొత్తం ఖాళీలు : 450 (జనరల్-227, ఓబీసీ-121, ఎస్సీ-67, ఎస్టీ-35)
-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 2018 జనవరి 1 నాటికి అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి.
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి కనిష్ఠంగా 20 ఏండ్లు, గరిష్ఠంగా 28 ఏండ్లలోపు ఉండాలి. అంటే 1988 జనవరి 2 నుంచి 1998 జనవరి 1 మధ్యన జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
-అప్లికేషన్ ఫీజు: 
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 708/- 
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 118/-
-కోర్సు ఫీజు: బోర్డింగ్, లాడ్జింగ్, కోర్సు ఫీజు, ఇతర రుసుములు కలుపుకొని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్‌లో రూ. 3.50 లక్షలు + సర్వీస్ ట్యాక్స్, ఎన్‌ఐటీటీఈ మంగళూరులో రూ. 3లక్షలు + సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి. ఈ మొత్తాన్ని కూడా తక్కువ వడ్డీకి విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటునందించేదుకుగాను కెనరా బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ రూపంలో ఇస్తుంది.
-కోర్సు వ్యవధి: 12 నెలలు. ఏడాదిపాటు కొనసాగే పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సును మొదటి 9 నెలలు క్లాస్ రూమ్ ట్రెయినింగ్ స్టడీని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లేదా ఎన్‌ఐటీటీఈ యూనివర్సిటీ నిర్వహిస్తాయి. చివరి 3 నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఏదైనా కెనరాబ్యాంక్‌లో చేయాల్సి ఉంటుంది. విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు పీజీడీబీఎఫ్ డిప్లొమా సర్టిఫికెట్‌తో పాటు ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఐదేండ్లపాటు సర్వీస్ పూర్తి చేసుకొన్న అభ్యర్థులకు ఆరో సంవత్సరం నుంచి పదో సంవత్సరం వరకు జీతంతోపాటుగా అదనంగా ఏడాదికి లక్ష రూపాయలను కెనరా బ్యాంక్ చెల్లిస్తుంది.
-పే స్కేల్: రూ. 23,700-42,020/-
-ఎంపిక విధానం: సింగిల్ ఆన్‌లైన్ టెస్ట్+ పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్.
-ఈ ఆన్‌లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనికి కేటాయించిన సమయం రెండు గంటలు
-ఈ ఆన్‌లైన్ పరీక్షను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ టెస్ట్ (ఐబీపీఎస్) నిర్వహిస్తుంది 
-కనీసం కటాఫ్ మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోత విధిస్తారు.
-ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్‌కు కేటాయించిన 
మొత్తం మార్కులు బ్యాంక్ నిర్ణయిస్తుంది.
-రాతపరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను కలిపి తుది ఎంపిక చేస్తారు
-ఆన్‌లైన్ పరీక్షలోప్రతిభచూపిన అభ్యర్థులను ప్రకటించిన ఖాళీల సంఖ్యకు 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు.
-ఆన్‌లైన్ పరీక్ష మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల ద్వారా తుది ఫలితాలను ప్రకటిస్తారు. 
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతితో సహా దేశవ్యాప్తంగా 189 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, విద్యార్హతలు, తదితర వివరాలను ఎంటర్ చేయాలి. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 31
-డౌన్‌లోడ్ కాల్‌లెటర్స్: ఫిబ్రవరి 20 తర్వాత
-ఆన్‌లైన్ పరీక్షతేదీ: మార్చి 4
-వెబ్‌సైట్: www.canarabank.com. 
ఆన్‌లైన్ రాతపరీక్ష సిలబస్
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు 
రీజనింగ్ 50 50 
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 50 
జనరల్ అవేర్‌నెస్ 50 50