notifications

బైక్ అంబులెన్స్‌లో ఉద్యోగాలకు 9న ఇంటర్వ్యూలు

Webdesk | Sunday, January 7, 2018 10:58 AM IST

 హైదరాబాద్ : జీవీకే - ఈఎంఆర్‌ఐలో బైక్ అంబులెన్స్‌లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 9న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం మేనేజర్ భుమా నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీలైఫ్ సైన్సెస్, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన 22 - 30 ఏండ్ల పురుష అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ద్విచక్ర వాహన లైసెన్స్ కలిగి ఇంగ్లీష్, తెలుగు చదవడం, రాయడం వచ్చి, 5.4 అంగులాల ఎత్తు, శారీరక దారుడ్యం కలిగినవారు ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. ఇంటర్వ్యూలను కింగ్‌కోఠి జిల్లా దవాఖానలోని 108 ఆఫీస్‌లో నిర్వహిస్తామన్నారు. వివరాల కోసం 91007 99259/264/ 167 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.