భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
 
        వివరాలు: దేశంలో అతిపెద్ద విద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌ను 1964లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ మహారత్న హోదా కలిగి ఉంది. 
        -వివరాలు: అప్రెంటిస్ 1973 అండ్ 1986 యాక్ట్ ప్రకారం శిక్షణ ఇస్తారు.
        -మొత్తం ఖాళీల సంఖ్య: 229 (గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-138, టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్-91)
        -విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, మోడ్రన్ ఆఫీస్ మేనేజ్‌మెంట్
        -గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-138 ఖాళీలు
        -అర్హత: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ 70 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 60 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. 
        -టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్-91 ఖాళీలు
        -అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచీలో డిప్లొమా ఉత్తీర్ణత. 
        -గమనిక: డిస్టెన్స్, కరస్పాండెన్స్ విధానంలో డిగ్రీ/డిప్లొమా చేసిన అభ్యర్థులు అప్రెంటిస్ చేయడానికి అర్హులు కారు.
        -వయస్సు: 2017 నవంబర్ 1 నాటికి కనిష్ఠంగా 14 ఏండ్లు, గరిష్ఠంగా 25 ఏండ్లకు మించరాదు. 
        -స్టయిఫండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ. 6000/-, టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్ రూ.4000/- శిక్షణలో భాగంగా ప్రతి నెల 
        చెల్లిస్తారు.
        -ట్రెయినింగ్ పీరియడ్: ఏడాది
        -ఎంపిక: అకడమిక్ మార్కులు ఆధారంగా
        -దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
        -చివరితేదీ: డిసెంబర్ 10
        -ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి 
        చివరితేదీ: డిసెంబర్ 17
        -వెబ్‌సైట్: www.bhelbpl.co.in
