notifications

ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ పోస్టులు

Webdesk | Wednesday, January 10, 2018 11:57 AM IST

 సికింద్రాబాద్ ఆర్‌కేపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:-మొత్తం ఖాళీలు- 39 
-విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు
-ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)- 16 ఖాళీలు (ఫిజిక్స్-1, కెమిస్ట్రీ-1, సోషల్ సైన్స్ -3, మ్యాథ్స్-4, ఇంగ్లిష్-4, హిందీ- 2, సంస్కృతం-1)
-అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. బోధనలో అనుభవం ఉండాలి. బీఎడ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
-పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- 7 ఖాళీలు. (ఫిజిక్స్- 1, బయాలజీ- 1, పొలిటికల్ సైన్స్- 1, జాగ్రఫీ- 1, సైకాలజీ- 1, ఎకనామిక్స్- 1, హిస్టరీ - 1)
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు బీఈడీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. బోధించే సామర్థ్యం, అనుభవం ఉండాలి. 
నోట్: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహించిన సీఎస్‌బీ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-ప్రైమరీ టీచర్స్ (పీఆర్‌టీ)- 12 ఖాళీలు. 
-అర్హతలు: గ్రాడ్యుయేషన్‌తోపాటు డీఈడీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-టీజీటీ, పీఆర్‌టీ పోస్టులకు సీటెట్/టెట్ ఎగ్జామ్, అవేస్ నిర్వహించిన సీఎస్‌బీలో అర్హత సాధించినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్ (పీటీఐ-పీఆర్‌టీ)- 2
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ ఉండాలి.
-పీఆర్‌టీ- మ్యూజిక్ (వెస్ట్రన్) - 1
-ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ - 1
-అర్హతలు: పై రెండు పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం అర్హతలు ఉండాలి.
-వయస్సు: అనుభవం ఉన్నవారికి 57 ఏండ్ల లోపు, ఫ్రెషర్స్‌కు 40 ఏండ్లు మించరాదు.
-దరఖాస్తు: స్కూల్ వెబ్‌సైట్‌లో
-ఫీజు: రూ. 100/-
-పూర్తిచేసిన దరఖాస్తును దాఖలు చేయడానికి చివరితేదీ: జనవరి 31
పాఠశాల చిరునామా:
ఆర్మీ పబ్లిక్ స్కూల్,
ఆర్‌కేపురం, సికింద్రాబాద్
వెబ్‌సైట్: http://www.apsrkpuram.edu.in