notifications

30వ తేదీన జాబ్‌మేళా

Webdesk | Wednesday, March 28, 2018 10:19 AM IST

 హైదరాబాద్: నగరానికి చెందిన బిజినెస్ 2 బిజినెస్ పోర్టల్ ట్రేడ్ హైదరబాద్.కామ్ ఆధ్వర్యంలో ఈ నెల 30 న ఈవెంట్ మేనేజ్ మెంట్ అండ్ ఈ కామర్స్ ఉద్యోగ మేళాను నిర్వహించనున్నట్లు ట్రేడ్ హైదరాబాద్ డాట్ కాం సీఓఓ శ్రీలత తెలిపారు. ఎలాంటి ఫీజులు చెల్లించకుండా ఏదైనా డిగ్రీ , ఎంబీ ఏ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు కొత్త అభ్యర్ధులు, ఉద్యోగ అనుభవం ఉన్న అభ్యర్ధులు కూడా ఈ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఉద్యో గానికి ఎంపికైన అభ్యర్ధులకు రూ. 24 వేల నుం చి 32 వేల వరకు వేతనంతో పాటు టీఏ డీఏ , బిజినెస్ అలవెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు. జాబ్‌మేళాలో పాల్గొనదలచిన అభ్యర్ధులు 7337556150 ఫోన్ నెంబరు లో తమ పేర్లునమోదు చేసుకోవాలని కోరారు.