news

నేడు 1999 గ్రూప్‌–2 మెరిట్‌ జాబితా

Webdesk | Friday, December 23, 2016 12:05 PM IST

నేడు 1999 గ్రూప్‌–2 మెరిట్‌ జాబితా

హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1999 గ్రూప్‌– 2 పోస్టులకు సంబంధించి తాజా మెరిట్‌ జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి మెరిట్‌ జాబితాను ఒకటికి పదిసార్లు సరిచూసుకొని తప్పులు లేకుండా ఖరారు చేసిన కమిషన్‌ అధికారులు గురువారమే విడుదల చేయాలని భావించారు.ఏపీపీఎస్సీ కమిషన్‌ ఆమోదముద్ర కూడా తీసుకున్నాకనే విడుదల చేయాలని జాబితా వెల్లడిని శుక్రవారానికి వాయిదా వేశారు. జాబితాను శుక్రవారం కమిషన్‌ ముందు పెట్టి ఆ తరువాత విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.