news

అమ్మాయిలకు కెరియర్‌ స్కాలర్‌షిప్‌

webdesk | Friday, January 20, 2017 11:40 AM IST

అమ్మాయిలకు కెరియర్‌ స్కాలర్‌షిప్‌

ఇంటర్న్‌శాల ‘ఇంటర్న్‌శాల కెరియర్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ గర్ల్స్‌- 2017’ పేరుతో వార్షిక ఉపకారవేతనాలను అందించనుంది. విద్యార్థినులు తాము ఎంచుకున్న రంగంలో అభివృద్ధి చెందటం కోసం వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీనిని ప్రవేశపెట్టారు. ఎన్నో అవరోధాలను అధిగమించి, తమకు నచ్చిన రంగంలో (అకడమిక్స్‌, స్పోర్ట్స్‌, ఆర్ట్స్‌ మొదలైనవి) ప్రవేశించిన అమ్మాయిలను ప్రోత్సహించడానికి దీన్ని రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

అర్హత: కళాశాల విద్యను అభ్యసిస్తూ, 31 డిసెంబరు 2016 నాటికి 17 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసున్న ఏ భారతీయ విద్యార్థిని అయినా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉపకారవేతన మొత్తం రూ.25,000ను ఒకేసారి (వన్‌ టైం రివార్డ్‌) ఇస్తారు. దీనిని విద్యార్థినులు ఏదైనా ఇంటర్న్‌షిప్‌ను చేస్తున్నందుకు అలవెన్సుగా లేదా తమ రంగంలో ఏదైనా ప్రాజెక్టును చేయడానికి/ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో చేరడానికి ఉపయోగపడుతుంది.

తుది గడువు: జనవరి 31, 2017

దరఖాస్తు లింకు: internshala.com/i/908