higher-education

ఉచితంగా ట్యాలీ, కంప్యూటర్ శిక్షణ

webdesk | Friday, August 4, 2017 9:46 AM IST

 బన్సీలాల్‌పేట్ : టెక్ మహీంద్రా ఫౌండేషన్, అప్సా స్వచ్చంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచితంగా ట్యాలీ, కంప్యూటర్ బేసిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, టైపింగ్, సేల్స్ రంగాలలో మూడు నెలల పాటు నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి 100 శాతం ఉద్యోగాలను కల్పిస్తామని అప్సా డైరెక్టర్ శ్రీపతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెట్టుగూడ, ముషీరాబాద్‌లలో ఉన్న తమ రెండు శిక్షణా కేంద్రాలలో కొన్ని సీట్లు మిగిలాయని, ఇందులో చేరడానికి 18 నుండి 27 ఏళ్ళలోపు వయస్సు గల యువతీ యువకులు అర్హులని అన్నారు. 10వ తరగతి పాసై, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ వారు, ట్యాలీ కోసం బీకామ్ పాసైన వారు తమ విద్యార్హత, ఆధార్ జిరాక్స్‌లు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో వచ్చి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాల కోసం సెల్ నెంబర్ 90637 80994, 99490 25230లలో సంప్రదించాలని ఆయన కోరారు.