higher-education

తెలుగు విశ్వవిద్యాలయంలో దూరవిద్యా కోర్సు తరగతులు

Webdesk | Thursday, July 26, 2018 11:46 PM IST

 హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలో ప్రవేశం పొందిన విద్యార్థిని, విద్యార్థులకు అనుసంధాన తరగతులు నిర్వహిస్తున్నాట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య పుంజాల ఒక ప్రకటనలో తెలిపారు. 2017-18 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం కోర్సుల్లో ప్రవేశించిన విద్యార్థులకు ఆగస్టు 2 నుంచి ఆగస్టు 11 వరకు తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థలు మరింత సమాచారం కోసం విశ్వవిద్యాలయానికి సంబంధించిన www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.

ఎం.ఏ అస్ట్రోలోజి, తెలుగు, సంస్కృతి, కమ్యూనికేషన్ జర్నలిజం, బీఏ స్పేషల్ తెలుగు, బి.ఏ కర్నాటక మ్యూజిక్, డిప్లామా ఫీలీం రైటింగ్ కోర్సులకు ఆగస్టు 2 నుంచి 11 వరకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, అదేవిధంగా ఎంఏ ఈఐటీ, టూరిజం మనేజ్‌మెంట్, పీజీ డిప్లామా ఇన్ జ్యోతిరవాస్త్య, పీజీ డిప్లామా ఇన్ టీవీ జర్నలిజం, డిప్లామా లైట్ మ్యూజిక్, డిప్లామా ఇన్ జ్యోతిస్యం, సర్టిఫికేట్ కోర్సు ఇన్ జ్యోతిస్యం, సంగీత విశారద కోర్సులకు ఆగస్టు 7 నుంచి ఆగస్టు 2వరకు దూరవిద్యా తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.