higher-education

రామకృష్ణ మఠంలో విదేశీ కోర్సులు

Webdesk | Tuesday, December 12, 2017 9:56 AM IST

 హైదరాబాద్ : ఔత్సాహికులకు విదేశీ భాషల్లో శిక్షణనిస్తూ నిలదొక్కుకునేలా తీర్చిదిద్దుతున్న వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో పలు కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మఠాధిపతి స్వామి స్థితికంఠానంద తెలిపారు. దోమల్‌గూడలోని రామకృష్ణమఠానికి అనుబంధంగా నడుస్తున్న ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రెంచ్, జర్మన్, స్పానిష్, జపనీస్, హిందీ, సంస్కృత భాషల్లో శిక్షణ నివ్వనున్నామన్నారు. ఆసక్తి గల వారు డిసెంబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 040 -27635545, 96035 78545 నెంబర్లను సంప్రదించాలన్నారు.