higher-education

ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

webdesk | Saturday, August 12, 2017 11:48 AM IST

 హైదరాబాద్ : 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఓపెన్ సొసైటీ హైదరాబాద్ ఓపెన్ స్కూల్‌లో టెన్త్, ఇంటర్మీడియట్‌లలో ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మీ-సేవా, టీఎస్ ఆన్‌లైన్‌ల ద్వారా దరఖాస్తులను ఈ నెల 17వ తేదీ నుండి సెప్టెంబర్ 4 వ తేదీ లోగా పంపించాలని అన్నారు. అపరాధ రుసుంతో సెప్టెంబర్ 5 నుండి 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కొరకు www.telangana open school.org వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షా ఫీజులను చెల్లించని వారి కోసం తాత్కాల్ పద్దతిలో ఈ నెల 16 నుండి 21 వ తేదీ వరకు మీ- సేవా కేంద్రాల్లో టెన్త్ పరీక్ష ఫీజుకు అదనంగా రూ.500, ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజుకు అదనంగా రూ.1,000 రుసుం చెల్లించి జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు.