higher-education

ఇంద్రజాల కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Webdesk | Saturday, June 10, 2017 11:30 AM IST

తెలుగుయూనివర్సిటీ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న ఇంద్ర జాల కోర్సులో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కోర్సు ఇన్‌చార్జి సామల వేణు ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన యువతీ, యువకులతో పాటు ఈ కళ పట్ల ఆసక్తి ఉన్న వారు వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో కేవలం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగే ఈ కోర్సుకు హాజరుకావచ్చన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫి కెట్‌ను అందజేస్తామన్నారు. ఈ కోర్సులో చేరే అభ్యర్థులు జూన్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలని కోరారు. అపరాధ రుసుముతో ఈ నెల 28వరకు చేరవచ్చన్నారు. వివరాలకు 9059794553 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.