higher-education

ఫారెస్ట్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా

webdesk | Monday, August 28, 2017 10:19 AM IST

 భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్‌ఎం) 2018-20 అకడమిక్ ఇయర్‌కు పీజీ డిప్లొమా ఇన్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.


వివరాలు:
పర్యావరణం, అడవులు & పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలో పనిచేస్తున్న ఈ స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ (ఐఐఎఫ్‌ఎం)ను 1982లో స్థాపించారు.
- పీజీ డిప్లొమా ఇన్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎఫ్‌ఎం)
- కోర్సు వ్యవధి: రెండేండ్లు 
- మొత్తం సీట్ల సంఖ్య: 120
- అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ పీహెచ్‌సీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్-2017, గ్జాట్-2018 స్కోర్ కార్డ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

- పర్‌ఫార్మెన్స్ ఆధారంగా మొత్తం 120 సీట్లలో 20 సీట్లకు స్కాలర్‌షిప్ ఇస్తారు.
- కోర్సు ఫీజు: ట్యూషన్+ హాస్టల్ ఫీజులు కలుపుకొని రూ. 4,80,000 (జనరల్, ఓబీసీ అభ్యర్థులు), రూ. 2,88,000 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు)
- టైప్ ఆఫ్ ప్రోగ్రామ్: ఫుల్‌టైమ్ రెసిడెన్షియల్ ప్రోగ్రాం
- అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 500/-)
- రిజర్వేషన్‌లు: వచ్చిన దరఖాస్తుల్లో ఎస్సీ-15%, ఎస్టీ 7.5%, పీహెచ్‌సీ-3%, ఓబీసీ అభ్యర్థులకు 27% సీట్లను కేటాయిస్తారు.

- ఎంపిక: క్యాట్/గ్జాట్ స్కోర్, గ్రూప్ డిష్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
- గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు:భోపాల్, బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌కతా
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చిరునామా: Chairperson,PGDFM Admission Indian Institute of Forest Management,Nehru Nagar, Bhopal-462 003 
- వెబ్‌సైట్:www.iifm.ac.in