higher-education

ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు

Webdesk | Saturday, January 6, 2018 12:22 PM IST

 నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) వివిధ యూనిట్/ఆఫీస్‌లలో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

 వివరాలు: 
మినీరత్న హోదాను కలిగిన ఎన్‌ఎఫ్‌ఎల్‌ను న్యూఢిల్లీలో 1974 ఆగస్టు 23న ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-మొత్తం పోస్టుల సంఖ్య: 46


విభాగాలవారీగా ఖాళీలు: 
-డిప్యూటీ జనరల్ మేనేజర్/చీఫ్ మేనేజర్-2 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ/ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ లేదా పీజీ/రెండేండ్ల డిప్లొమా (హెచ్‌ఆర్‌ఎం/పర్సనల్ మేనేజ్‌మెంట్& ఇండస్ట్రియల్ రిలేషన్స్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-సీనియర్ మేనేజర్-3 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఇన్ లా (ఎల్‌ఎల్‌బీ)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (కెమికల్)-25 (జనరల్-14, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-2)
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (మెకానికల్)-10 (జనరల్-6, ఓబీసీ-1, ఎస్సీ-2, ఎస్టీ-1)
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎలక్ట్రికల్)-6 (జనరల్-4, ఓబీసీ-1, ఎస్సీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. గేట్- 2016లో అర్హత సాధించాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. 
-వయస్సు: 2017 డిసెంబర్ 31 నాటికి 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
-పే స్కేల్: రూ. 16,400-40,500/-, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
-దరఖాస్తు ఫీజు: రూ. 735/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: గేట్ స్కోర్-2016 +ఇంటర్వ్యూ ద్వారా
-గేట్ -2016 స్కోర్‌కు 80 శాతం , ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
-మేనేజర్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీచేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
-దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 18 , మేనేజర్ పోస్టులకు చివరితేదీ: జనవరి 31
-వెబ్‌సైట్: www.nationalfertilizers.com