higher-education

బిట్‌శాట్ 2018ప్రవేశాలు

Webdesk | Sunday, January 21, 2018 11:29 AM IST

 రాజస్థాన్ (పిలానీ)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (బిట్స్) 2018-19 అకడమిక్ ఇయర్‌కు ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ -బిట్‌శాట్ 2018 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

వివరాలు :పిలానీ, గోవా, హైదరాబాద్, దుబాయ్ క్యాంపస్‌లలో కింది ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్ కల్పిస్తారు.

బిట్స్ పిలానీ క్యాంపస్‌లో కోర్సులు:
-బీఈ (కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్)
-బీ ఫార్మసీ
-ఎమ్మెస్సీ (బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్), ఎమ్మెస్సీ జనరల్ స్టడీస్
హైదరాబాద్ క్యాంపస్‌లో కోర్సులు:
-బీఈ (కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్)
-బీ ఫార్మసీ
-ఎమ్మెస్సీ(బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్) 
కె కె బిర్లా గోవా క్యాంపస్‌లో కోర్సులు:
-బీఈ (కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్) 
-ఎమ్మెస్సీ (బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్)
దుబాయ్ క్యాంపస్‌లో కోర్సులు:
-బీఈ (కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్)
అర్హతలు: 
-బీఈ, ఎమ్మెస్సీ కోర్సులు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లో 75 శాతం మార్కులతోఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
-బీ ఫార్మసీ కోర్సు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ (బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్)లో 60 శాతం మార్కులతోఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ఉండాలి.
-గమనిక: 2017లో ఇంటర్ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు లేదా 2018లో ఇంటర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-కేంద్ర/రాష్ట్రాల బోర్డు పరీక్షలో మొదటి ర్యాంకులు పొందిన విద్యార్థులకు బిట్‌శాట్‌కు సంబంధం లేకుండా డైరెక్టుగా అడ్మిషన్ కల్పిస్తారు.
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ పరీక్ష 
-ఈ పరీక్షను బిట్స్‌పిలానీ నిర్వహిస్తుంది.
-బిట్‌శాట్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలకుగాను 3 గంటల్లో పూర్తిచేయాలి.
-పార్ట్ 1 ఫిజిక్స్-40 ప్రశ్నలు
-పార్ట్ 2 కెమిస్ట్రీ-40 ప్రశ్నలు
-పార్ట్ 3 ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ-15 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్-10 ప్రశ్నలు
-పార్ట్ 4 మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ (బీ ఫార్మసీ అభ్యర్థులు)-45 ప్రశ్నలు
-పరీక్ష కేంద్రాలు: పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లతో సహా మొత్తం 50 సెంటర్లలో బిట్‌శాట్ 2018ను నిర్వహిస్తారు.
-అభ్యర్థులు ఏ పరీక్ష కేంద్రంలో హాజరవుతారో తెలియజేయాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. -2950/-(బాలురు), రూ.2450/-(బాలికలు)

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. సూచించిన ఫార్మాట్‌లోనే పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు: 
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 13
-ఆన్‌లైన్ అప్లికేషన్ ఎడిట్ (సవరణ) చేసుకోవడానికి చివరితేదీ: మార్చి 15-19
-టెస్ట్ సెంటర్ కేటాయింపులు: మార్చి 21
-అభ్యర్థులు టెస్ట్ తేదీలు రిజర్వు చేసుకోవడం: మార్చి 23 - ఏప్రిల్ 5
-హాల్ టికెట్ల డౌన్‌లోడింగ్ : ఏప్రిల్ 12- మే 10
-బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్‌లు: మే 16-31
-వెబ్ సైట్: www.bitsadmission.com