higher-education

ఏఎన్‌యూ దూరవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం

webdesk | Monday, February 6, 2017 8:33 AM IST

హైదరాబాద్ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం ద్వారా బ్యాచ్‌లర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కో-ఆర్టినేటర్ వై జయపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మే 2017లో జరిగే వార్షిక పరీక్షలు రాయదలిచిన వారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఏ, ఎంబీఏ, బీయస్సీ, బీకామ్, బీఏ, బ్యాచ్‌లర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరదల్చిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 98491 44925, 99599 74064 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.