university

ఒకేషనల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Webdesk | Tuesday, May 22, 2018 11:00 AM IST

ఒకేషనల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

  ఉస్మానియా యూనివర్సిటీ: దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎం ఎస్) అనుబంధంగా మహబూబ్‌నగర్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఒకేషనల్ కోర్సె స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వొకేషనల్ కోర్సులకు దరఖాస్తులను స్వీకరించ నున్నట్లు అధికారులు తెలిపారు. బెడ్‌సైడ్ అసిస్టెంట్, హెల్త్‌కేర్ మల్టీపర్పస్ వర్కర్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ తదితర విభాగాలలో షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను స్వీక రించనున్నట్లు ప్రకటించారు. కనీసం పదవ తరగతి పాసై పద్దెనిమిదేళ్లు పూర్తైన వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని చెప్పారు.

ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన వారికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌కు చెందిన స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ తరపున సర్టిఫికెట్ అందజేస్తామని పేర్కొన్నారు. సీట్లు పరిమితమన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలని వివరించారు. ఇతర వివరాలకు 9908128726, 8886855620, 7981562620 నెంబర్‌లలో సంప్రదించాలని సూచించారు.