university

తెలుగు వర్సిటీ దూరవిద్య షెడ్యూల్ విడుదల

Webdesk | Wednesday, January 3, 2018 11:28 AM IST

 హైదరాబాద్ : తెలుగు విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రంలో వివిధ కోర్సులను అభ్యసించడానికి ప్రవేశ దరఖాస్తు జనవరి 20 చివరి తేదీ అని వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. ఆలస్య రుసుము రూ.300తో ఫిబ్రవరి 28లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 2017-18తోపాటు గత విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల షెడ్యుల్‌ను విడుదల చేశారు. కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆగస్టు 2 నుంచి 11వ తేదీవరకు తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెండో సంవత్స రం విద్యార్థులకు 2019 జనవరి 2 నుంచి 11 వరకు, ఎంఏలో టూరిజం, ఈఎల్‌టీ, సంగీత విశారద కోర్సులో రెండు నుంచి ఆరేండ్ల కాలవ్యవధి కోర్సులకు జనవరి 7 నుంచి 11 వరకు తరగతులు ఉంటాయన్నారు. 

మిగిలిన సంవత్సరాల కోర్సులకు ఏటా జనవరిలో అనుసంధాన తరగతులు నిర్వహిస్తామన్నారు. మెదటి సంవత్సరం జూన్ 30, రెండో సంవత్సరం జూన్ 31 వరకు ఎంసీజే అసైన్‌మెంట్స్, జూన్ 30 వరకు సీసీఎంటీ రెస్పాన్స్ పత్రాలు, జూలై 31కి టెలివిజన్ డాక్యుమెంటరీ సీడీ, 2019 జూలై 31న ఎంఏ జ్యోతిషం రెండో సంవత్సరం పేపర్-5 ప్రాజెక్టులను సమర్పించాలని ప్రకటించారు. 2018 అక్టోబర్, నవంబర్ మధ్య కాలంలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.