university

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ

Webdesk | Sunday, December 17, 2017 11:03 PM IST

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ

 నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో 2017-18 విద్యాసంవత్సరానికి వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

 
వివరాలు:
మహాత్మాగాంధీ యూనివర్సిటీని 2007లో ఏర్పాటుచేశారు.
-కోర్సు పేరు: పీహెచ్‌డీ 
విభాగాలవారీగా ఖాళీలు: 
-ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ 
(మేనేజ్‌మెంట్ స్టడీస్-10, కామర్స్-4)
-ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ (ఎకనామిక్స్-2)
-ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ (బయోకెమిస్ట్రీ-4, బయెటెక్నాలజీ-6, కెమిస్ట్రీ-14, మ్యాథమెటిక్స్-4, కంప్యూటర్ సైన్స్-2)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ లేదా మాస్టర్ డిగ్రీలో 55 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్, స్లేట్, సెట్, సంబంధిత సబ్జెక్టులో ఎంఫిల్ (రెగ్యులర్ విధానంలో)లో ఉత్తీర్ణత సాధించాలి. 
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ 
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/- (డీడీరూపంలో)
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తు నింపి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి. 
-దరఖాస్తులకు చివరితేది : డిసెంబర్ 30
-వెబ్‌సైట్:http://mguniversity.ac.in