telugu

ఓయూ పరిధిలో బీఎస్సీ(ఏవియేషన్) పరీక్షా ఫీజు స్వీకరణ

webdesk | Saturday, April 8, 2017 7:50 PM IST

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఎస్సీ(ఏవియేషన్) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 28వ తేదీలోగా చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలు మే, జూన్ నెలల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. వివరాలకు ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.