telugu

జూన్ 5 నుంచి ఓయూసెట్ పరీక్షలు

webdesk | Wednesday, May 24, 2017 9:13 PM IST

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఓయూసెట్ - 2017 పరీక్షా తేదీలను అధికారులు ఖరారు చేశారు. ఈ పరీక్షలు వచ్చే నెల 5వ తేదీ నుంచి 13వరకు రోజుకు మూడు పరీక్షల చొప్పున నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సెట్ ద్వారా ఓయూ తో పాటు పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల పీజీ కోర్సులలో ప్రవేశాల ను నిర్వహిస్తారు. హాల్‌టికెట్లను అభ్యర్థులు వచ్చే నెల 1 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.


30 నుంచి సెల్ట్ తరగతులు
ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 30 వ తేదీ నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ జె. సావిత్రి తెలిపారు. ఎ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గా పిలువబడే ఈ కోర్సుకు ఉదయం, సాయంత్రం వేర్వేరుగా తరగతులు నిర్వ హించనున్నట్లు చెప్పారు. రెండు నెలల కాలవ్యవధి గల ఈ కోర్సుకు రుసుమును రూ. 4,000 గా నిర్ణయించినట్లు చెప్పారు. ఓయూ విద్యార్థులు, ఉద్యోగుల, అనుబంధ కళాశాలల విద్యార్థులకు ఫీజులో రాయితీ ఉంటుందని చెప్పారు. ఇతర వివరాలకు 9652856107, 040-64575575, 27682354 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.