telugu

ఇంటర్‌తో నేవీలో కొలువులు

webdesk | Monday, May 22, 2017 10:23 PM IST

భారత రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ సెయిలర్ పోస్టుల భర్తీకి సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌ఎస్‌ఆర్) - 2/2018 బ్యాచ్‌లో చేరటానికి అర్హత గల అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇండియన్ నేవల్ అకాడమీ విడుదలచేసింది.

వివరాలు:
భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని నావికాదళంలో సెయిలర్ పోస్టులు. ఫిబ్రవరి 2018లో కోర్సు ప్రారంభమవుతుంది.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌ల్లో ఏదో ఒక సబ్జెక్టు కలిగి ఉండాలి.
వయస్సు: 1997, ఫిబ్రవరి 1 - 2001 జనవరి 31 మధ్యన జన్మించి ఉండాలి

పే అండ్ అలవెన్స్‌లు 
-శిక్షణా కాలంలో నెలకు రూ. 5,700/- స్టయిఫండ్ ఇస్తారు. 
-శిక్షణ పూర్తయిన తర్వాత రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/- + డీఏ ఇస్తారు.
పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్- 1 (సుబేదార్‌కు సమాన స్థాయి) వరకు ఉంటుంది. 
-ఈ స్థాయిలో పే స్కేల్ రూ. 9,300 - 34,800+ గ్రేడ్ పే రూ. 4800/- 
-అదనంగా ఎంఎస్‌పీ రూ. 2000 + డీఏ ఇస్తారు.
-శిక్షణాకాలంలో సెయిలర్స్‌కు పుస్తకాలు, యూనిఫాం, భోజనం, వసతి సౌకర్యాలను ఉచితంగా ఇస్తారు. సెయిలర్స్, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తారు. సెయిలర్స్ పిల్లల విద్య, హెచ్‌ఆర్‌ఏ అలవెన్సులు ఇస్తారు. వీటితోపాటు సంవత్సరాంత సెలవులు ఉంటాయి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్స్ ద్వారా 
 

రాతపరీక్ష:
-ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
-పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు 
-ప్రశ్నపత్రం ఇంటర్ స్థాయిలో ఉంటుంది.
-పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు 
-అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.
 

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ)


-7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి
-20 ఉతక్, బైతక్ (గుంజీలు), 10 పుష్ అప్స్
నోట్: క్రీడల్లో, స్విమ్మింగ్, ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం.
 

శారీరక ప్రమాణాలు
-కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి. 
-గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి 
-వీటితోపాటు నేవీ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మంచి కంటి చూపు ఉండాలి.
 

శిక్షణ:
-శిక్షణ ఫిబ్రవరి, 2018లో ప్రారంభమవుతుంది. 22 వారాల పాటు బేసిక్ ట్రెయినింగ్‌ను ఐఎన్‌ఎస్ చిల్కాలో ఇస్తారు. దీనితోపాటు ప్రొఫెషనల్ ట్రెయినింగ్‌ను నేవల్ ట్రెయినింగ్ కేంద్రాల్లో ఇస్తారు.
-శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకొన్న వారికి 15 ఏండ్లు కాలపరిమితికి నియామక ఉత్తర్వులు ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 22 నుంచి ప్రారంభం
చివరితేదీ: జూన్ 4
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in