telugu

హైదరాబాద్ మింట్‌లో 201 పోస్టులు

webdesk | Monday, April 10, 2017 11:00 AM IST

హైదరాబాద్‌లోని ఇండియా గవర్నమెంట్ మింట్‌లో జూ॥ అసిస్టెంట్, సూపర్‌వైజర్, టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు: ఇండియా గవర్నమెంట్ మింట్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోని ఒక విభాగం. భారత ఆర్థికశాఖ పరిధిలోని సంస్థ. ఇది ఐఎస్‌వో 9001-2000, మినీరత్న కంపెనీ.

జూనియర్ టెక్నీషియన్ - 141 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు.. ఫిట్టర్ -99, టూల్ అండ్ డై మేకర్ - 2, ఫర్‌గర్ అండ్ హీట్ ట్రీటర్ - 2, ల్యాబ్ అసిస్టెంట్/ఇన్‌స్ట్రుమెంట్, మెకానికల్, కెమికల్ - 6, డ్రైవర్ కమ్ మెకానికల్ (లైట్ మోటార్ వెహికల్)/ మోటార్ డ్రైవింగ్ మెకానిక్ మోటార్ వెహికల్ - 4, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ - 5, మిల్‌రైట్/మినీ రైట్ మెకానిక్ - 9, మెకానిస్ట్ - 3, టర్నర్ - 4, వెల్డర్ - 1, ప్లంబర్ - 4, మేషన్ (బిల్డింగ్) - 2 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ - 20, ఎస్టీ - 9, ఓబీసీ - 34 ఖాళీలు ఉన్నాయి. 

అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. డిప్లొమా ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఇస్తారు. 
పేస్కేల్: రూ. 5200 - 20,200 + గ్రేడ్ పే 1,800/-తోపాటు ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
వయస్సు: 2017, ఏప్రిల్ 1 నాటికి 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. 1992, ఏప్రిల్ 2 - 1999, ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి.
సూపర్‌వైజర్స్ - 9 ఖాళీలు. విభాగాల వారీగా...
మెకానికల్ - 4, ఎలక్ట్రానిక్స్ - 1, ఎలక్ట్రికల్ - 2, మెటలర్జీ - 1, సివిల్ -1 ఖాళీ ఉన్నాయి. 
అర్హతలు: ప్రథమశ్రేణిలో సంబంధిత విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత. బీఈ/బీటెక్ అభిలషణీయం.
పేస్కేల్: రూ. 12,300 - 25,400 తోపాటు ఇతర అలవెన్స్‌లు, సౌకర్యాలు ఉంటాయి.
వయస్సు: ఏప్రిల్ 1 నాటికి 18 - 30 ఏండ్ల మధ్య ఉండాలి.

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 51 పోస్టులు
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాలు, హిందీలో అయితే నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి.
ఆఫీస్ అసిస్టెంట్‌లో ప్రావీణ్యత ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,000తోపాటు ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
వయస్సు: ఏప్రిల్ 1 నాటికి 18 - 28 ఏండ్లు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నేటి నుంచి ప్రారంభం
ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్ ద్వారా
ఎంపిక విధానం: సూపర్‌వైజర్, జూనియర్ అసిస్టెంట్‌లకు వేర్వేరుగా ఆన్‌లైన్ ఎగ్జామ్‌లను నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: సూపర్‌వైజర్ పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్‌పై 50 ప్రశ్నలు. లాజికల్ రీజనింగ్ - 20, జనరల్ అవేర్‌నెస్ - 10, ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 10, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 10. 

మొత్తం 100 ప్రశ్నలు. 100 మార్కులు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు - జనరల్ అవేర్‌నెస్ - 50 మార్కులు, రీజనింగ్ - 20 మార్కులు, ఇంగ్లిష్ - 15, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 15 మార్కులు.
మొత్తం 150 ప్రశ్నలు - 100 మార్కులు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు.
జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు - ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఈ టెస్ట్‌లో జనరల్ సైన్స్ 20 మార్కులు, లాజికల్ రీజనింగ్ - 20, జనరల్ అవేర్‌నెస్ - 20, ఇంగ్లిష్ - 20, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 20 మార్కులు.
మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు.
పరీక్ష కాలవ్యవధి - 60 నిమిషాలు.
చివరితేదీ: మే 1
వెబ్‌సైట్: htpp://igmhyderabad.spmcil.com