telugu

హెచ్‌సీయూలో ప్రవేశాలు

webdesk | Monday, April 10, 2017 10:55 AM IST

తెలంగాణలోని ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) 2017-18 అకడమిక్ ఇయర్‌కు పలు విభాగాల్లో పీజీ, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు:మొత్తం సీట్ల సంఖ్య - 2027
విభాగాల వారీగా సీట్ల వివరాలు: 
ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ - 110 సీట్లు
మ్యాథమెటికల్ సైన్సెస్-16, ఫిజిక్స్-16, కెమికల్ సైన్సెస్-16, సిస్టం బయాలజీ-16, ఎర్త్ సైన్సెస్-10, హెల్త్ సైకాలజీ-16, ఆప్టొమెట్రీ అండ్ విజన్ సైన్సెస్-20)
అర్హత: 60 శాతం మార్కులతో ఆర్ట్స్/సైన్స్‌లో 10+2/ఇంటర్/హెచ్‌ఎస్‌సీలో ఉత్తీర్ణత.
ఎమ్మెస్సీ-292 సీట్లు (మ్యాథమెటిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్-40, స్టాటిస్టిక్స్-20, ఫిజిక్స్-45, కెమిస్ట్రీ-45, బయోకెమిస్ట్రీ-26, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ-18, మాలిక్యులార్ బయాలజీ-12, యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ-18, బయోటెక్నాలజీ-25, హెల్త్ సైకాలజీ-12, న్యూరోసైన్స్-8, కాగ్నిటివ్ సైన్స్-8, ఓషియన్ అండ్ అట్మాస్ఫిరియక్ సైన్సెస్-15)
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఏ/బీఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిగ్రీ స్థాయిలో ఏదైనా ఒక ప్రధాన సబ్జెక్ట్ (సంబంధిత సబ్జెక్ట్)గా చదివి ఉండాలి. బీఏ/బీఎస్సీ ఆనర్స్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఎంసీఏ-60 సీట్లు
అర్హత: బీఏ/బీఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలోమ్యాథమెటిక్స్ ఒక ప్రధాన సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. 

ఎంపీహెచ్ (పబ్లిక్ హెల్త్)-40 సీట్లు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంఈడీ-50 సీట్లు
అర్హత : బీఈడీ, బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఎంఏ-505 సీట్లు 
ఇంగ్లిష్-45, ఫిలాసఫీ-23, హిందీ-38, తెలుగు-45, ఉర్దూ-25, అప్లయిడ్ లింగ్విస్టిక్స్-23, కాంపేరిటివ్ లిటరేటర్-15, ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్-15, హిస్టరీ-52, పొలిటికల్ సైన్స్-52, సోషియాలజీ-52, ఆంత్రోపాలజీ-30, ఎకనామిక్స్-60, ఫంక్షనల్ ఎకనామిక్స్-30
అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిగ్రీ స్థాయిలో ఏదైనా ప్రధాన సబ్జెక్‌లో 55 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

ఎంపీఏ-31 సీట్లు 
అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత ప్రొఫెషనల్ సబ్జెక్ట్ డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి.
ఎంఎఫ్‌ఏ-38 సీట్లు 
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (బీఎఫ్‌ఏ, బీవీఏ, బీఏ (ఫైన్ ఆర్ట్స్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
ఎంఏ-కమ్యూనికేషన్-40 సీట్లు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిగ్రీస్థాయిలో కమ్యూనికేషన్/జర్నలిజం ప్రధాన సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
ఎంబీఏ-125 సీట్లు 
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. క్యాట్ స్కోర్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్ కల్పిస్తారు
ఎంటెక్-184 సీట్లు 
కంప్యూటర్ సైన్స్-45. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-35, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-35, ఐసీటీ టెక్నాలజీ-26, బయోఇన్ఫర్మాటిక్స్-25, మెటీరియల్ ఇంజినీరింగ్-18
అర్హత: బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంసీఏ లేదా తత్సమాన పరీక్షలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత మాస్టర్ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కొన్ని సబ్జెక్ట్‌లకు గేట్ స్కోర్‌ను కలిగి ఉండాలి.

ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్)- 20 సీట్లు
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 10+2/ ఇంటర్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంఫిల్ -175 సీట్లు
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. పీహెచ్‌డీ -371 సీట్లు
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ (బయోటెక్నాలజీ)-6 సీట్లు
అర్హత: 10+2+3 విధానంలో ఫిజికల్, బయాలజికల్, అగ్రికల్చరల్, వెటర్నరీలో డిగ్రీ, ఫిషనరీ సైన్స్, ఫార్మసీ, ఇంజినీరింగ్ టెక్నాలజీలో నాలుగేండ్ల బీఎస్సీ , ఎంబీబీఎస్/బీడీఎస్ లేదా తత్సమాన పరీక్షలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ. 350/- ఓబీసీ అభ్యర్థులు-250, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 150/-
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మే 5
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడింగ్: మే 22 నుంచి
రాతపరీక్ష తేదీలు: జూన్ 1,2,3,4,5
వెబ్‌సైట్:http://www.uohyd.ac.in