telugu

ధీరూభాయి అంబానీలో ఇంజినీరింగ్ కోర్సులు

webdesk | Monday, April 10, 2017 10:51 AM IST

గాంధీనగర్‌లోని ధీరూభాయి అంబానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 

వివరాలు: 2017 విద్యాసంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు: 
బీటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ)
బీటెక్ (ఆనర్స్ ఇన్ ఐసీటీ విత్ మైనర్ కంప్యుటేషనల్ సైన్స్)
పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు
ఎంటెక్ (ఐసీటీ), ఎమ్మెస్సీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
ఎం.డిజైన్ (కమ్యూనికేషన్ డిజైన్)
పీహెచ్‌డీ (పలు విభాగాల్లో రిసెర్చ్‌కు అవకాశం ఉంది)
అర్హతలు: బీటెక్ కోర్సులో ప్రవేశానికి ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఎంపీసీ లేదా బయోటెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా బాటనీతో ఉత్తీర్ణత.
1992, అక్టోబర్1న లేదా తర్వాత జన్మించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంటెక్ (ఐసీటీ) - బీఈ/బీటెక్‌లో సీఎస్, ఐటీ, ఈఈఈ, ఐసీటీ లేదా ఎమ్మెస్సీ సీఎస్‌ఈ, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, ఎంసీఏ లేదా ఎంఎస్ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఎమ్మెస్సీ (ఐటీ)- కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.
ఎం.డిజైన్ - ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
పీహెచ్‌డీ - పీజీ ఉత్తీర్ణత

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
వెబ్‌సైట్: www.daiict.ac.in