telangana

టీఎస్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ

webdesk | Saturday, May 27, 2017 8:27 PM IST

టీఎస్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2017-18 విద్యా సంవత్సారానికి వివిధ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
 
వివరాలు: 
ఈ యూనివర్సిటీ 2014లో ఏర్పాటైంది. 
(గతంలో ఆచార్య ఎన్ జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో భాగంగా ఉండేది) తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ పరిశోధన, అనుబంధ విద్య, విస్తరణను పర్యవేక్షిస్తుంది. 
కోర్స్ పేరు: ఫ్యాకల్టీ ఆఫ్ అగ్రికల్చర్
మొత్తం సీట్ల సంఖ్య: 17
విభాగాలు: ఆగ్రానమీ, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఎంటమాలజీ, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పాథాలజీ, క్రాప్ ఫిజియాలజీ, సాయిల్ సైన్స్, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మాలిక్యులార్ బయాలజీ, బయోటెక్నాలజీ
కోర్స్ పేరు: ఫ్యాకల్టీ ఆఫ్ హోం సైన్స్
మొత్తం సీట్ల సంఖ్య: 4
విభాగాలు: ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్, హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్, ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్, హోం సైన్స్ ఎక్స్‌టెన్షన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్ 
కోర్స్ పేరు: ఫ్యాకల్టీ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
మొత్తం సీట్ల సంఖ్య: 2
విభాగాలు : సాయిల్ అండ్ వాటర్ ఇంజినీరింగ్, ఫామ్ మెషినరీ అండ్ పవర్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా అగ్రికల్చర్/హోం సైన్స్‌లో 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ స్థాయిలో బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హోం సైన్స్), బీటెక్ (అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ), బీహెచ్‌ఎస్సీ (రూరల్)లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 జూలై 1 నాటికి 40 ఏండ్లకు మించరాదు. 
అప్లికేషన్ ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ. 1,325/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 725/-చెల్లించాలి.
ఎంపిక: అకడమిక్ సబ్జెక్ట్‌ల్లో వచ్చిన మార్కులు+ ప్రవేశ పరీక్ష/ఎంట్రెన్స్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
ఎంట్రెన్స్ టెస్ట్ 50 శాతం, ఎమ్మెస్సీ లెవల్‌కు 30 శాతం, బీఎస్సీ లెవల్‌కు 10 శాతం, ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ అధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ హార్డ్‌కాపీని ప్రింట్ తీసి, సంబంధిత పర్సనల్ అధికారికి స్పీడ్‌పోస్ట్‌లో మాత్రమే పంపాలి.
చిరునామా: The Registrar, Administrative Office, Professor Jayashankar Telangana State Agricultural University, Rajendranagar, 
Hyderabad - 500 030 
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 22
హార్డ్‌కాపీని పంపడానికి చివరితేదీ: జూన్ 22 (సాయంత్రం 4 గంటల వరకు)
వెబ్‌సైట్ : http://www.pjtsau.ac.in
 

బీఎస్సీ ఫారెస్ట్రీలో


తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫారెస్ట్ కాలేజ్, పరిశోధన ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) 2017-18 విద్యా సంవత్సారానికి నాలుగేండ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి (రెసిడెన్షియల్ ప్రోగ్రామ్) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఈ కళాశాల దూలపల్లిలో ఏర్పాటుచేశారు. సిద్దిపేట జిల్లా ములుగులో శాశ్వత భవనాలు నిర్మాణాలు పూర్తయ్యే వరకు తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లిలో ఈ కోర్సును నిర్వహిస్తారు.
కోరు: పేరు: నాలుగేండ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ 
మొత్తం సీట్ల సంఖ్య:50
అర్హత: రాష్ట్ర ఇంటర్ బోర్డ్‌చే గుర్తించబడిన ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన పరీక్షలో 45 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) ఉత్తీర్ణత. బయాలజీ, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రంలో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
వయస్సు: 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు 27 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్ ఫీజు: డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రూ. 500/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 250/-చెల్లించాలి)
ఎంపిక: ఇంటర్ బైపీసీ అకడమిక్ మార్కుల ఆధారంగా.
నాలుగేండ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ ఎంపికలో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. 
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలోనే సర్టిఫికెట్లు, ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
చిరునామా: ఆఫీసర్ ఇన్ చార్జ్ అడ్మిషన్స్, ఫారెస్ట్ కాలేజ్, పరిశోధన ఇన్‌స్టిట్యూట్ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లి, హైదరాబాద్-500014మొబైల్ నంబర్: 8332975516, 8333924137 
ఈ మెయిల్: [email protected].
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15 (సాయంత్రం 5 గంటల వరకు)
అపరాధ రుసుం రూ. 1000/-లతో చివరితేదీ: జూన్ 30 (సాయంత్రం 5 గంటల వరకు)
వెబ్‌సైట్:www.fcrits.in
 

మెరైన్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్


కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో కింది కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
కొచ్చిన్ షిప్‌యార్డ్ భారత ప్రభుత్వ రంగ సంస్థ. 
కోర్సు: మెరైన్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్
కాలవ్యవధి: ఏడాది
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌లో మెకానికల్/మెకానికల్ ఆటోమొబైల్ లేదా నేవల్ ఆర్కిటెక్చర్ ఉత్తీర్ణత. పదోతరగతి, ఇంటర్ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయస్సు: 28 ఏండ్లు మించరాదు
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరితేదీ: జూలై 1
వెబ్‌సైట్: www.cochinshipyard.com