telangana

తెలుగు వర్సిటీలో దూరవిద్య

Webdesk | Tuesday, December 5, 2017 10:32 AM IST

 హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (పీఎస్‌టీయూ) దూరవిద్యా విధానంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.  

వివరాలు:-కోర్సులు
-మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎంఏ): జ్యోతిషం, తెలుగు, సంస్కృతం, కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (ఈఎల్‌టీ), టూరిజం మేనేజ్‌మెంట్.
-అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఏడాది కాలవ్యవధి కలిగిన కమ్యూనికేషన్, జర్నలిజం కోర్సులో ప్రవేశం కోసం బీసీజే డిగ్రీ ఉండాలి. 
-బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ : సంగీతం, స్పెషల్ తెలుగు
-అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత.
-పీజీ డిప్లొమా: టెలివిజన్ జర్నలిజం, జ్యోతిర్వాస్తు.
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
-డిప్లొమా కోర్సులు: జ్యోతిషం, లైట్ మ్యూజిక్ (లలిత సంగీతం), ఫిల్మ్ రైటింగ్.
-అర్హత: ఇంటర్, పదోతరగతి ఉత్తీర్ణత. 
-సర్టిఫికెట్ కోర్సులు: జ్యోతిషం, మోడరన్ తెలుగు, సంగీత విశారద.
-అర్హతలు: పదోతరగతి పాసై ఉండాలి. 
-దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. నిర్ణీత నమూనాలోని దరఖాస్తును పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి కింది అడ్రస్‌కు పంపాలి. 
చిరునామా: డైరెక్టర్, దూరవిద్యాకేంద్రం, 
పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం, 
పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్-4
-దరఖాస్తు ఫీజు: రూ. 300 (డిమాండ్ డ్రాఫ్ట్).
-దరఖాస్తులకు చివరితేదీ: 2018, జనవరి 20
-వెబ్‌సైట్: www.teluguuniversity.ac.in